హెటిరో డ్రగ్స్ కంపెనీలో అప్రెంటీస్‌గా పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 350 ఉద్యోగాలకు వివిధ కేటగిరీలలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారికి 100 పోస్టులు, బీఎస్సీ కెమిస్ట్రీ వారికి 100 పోస్టులు, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీకి 100 పోస్టులు, ఐటీఐ చదివిన వారికి 50 పోస
డ్రగ్స్ కంపెనీలో అప్రెంటీస్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
Nov 2 2016 9:38 PM | Updated on May 25 2018 2:57 PM
బుట్టాయగూడెం : హెటిరో డ్రగ్స్ కంపెనీలో అప్రెంటీస్‌గా పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని ఐటీడీఏ పీవో ఎస్.షణ్మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 350 ఉద్యోగాలకు వివిధ కేటగిరీలలో అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారికి 100 పోస్టులు, బీఎస్సీ కెమిస్ట్రీ వారికి 100 పోస్టులు, ఎంఎస్సీ కెమిస్ట్రీ ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీకి 100 పోస్టులు, ఐటీఐ చదివిన వారికి 50 పోస్టులు ఉన్నాయన్నారు. 26 సంవత్సరాలలోపు వయసు కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 3 నుంచి ఐటీడీఏలోని యువత శిక్షణ కేంద్రంలో వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు వైటీసీ కోఆర్డినేటర్ ఎస్‌వీ సత్యనారాయణ 9959536789 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Advertisement


