68వ వన మహోత్సవ వేడుకలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ డ్రాయింగ్ పోటీల్లో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల విజేతలను జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ప్రకటించారు.
అనంతపురం ఎడ్యుకేషన్ : 68వ వన మహోత్సవ వేడుకలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ డ్రాయింగ్ పోటీల్లో జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల విజేతలను జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ప్రకటించారు. వ్యాసరచన పోటీల్లో ధర్మవరం గణేష్ మునిసిపల్ స్కూల్ విద్యార్థిని కె. శిరీష, ధర్మవరం మోడల్ స్కూల్ విద్యార్థిని ఎ. జాహ్నవి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వక్తృత్వ పోటీల్లో ధర్మవరం మోడల్ స్కూల్ విద్యార్థిని కె. రుచిత, బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని కె.జ్యోతి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. డ్రాయింగ్ పోటీల్లో అనంతపురం కేఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థిని హెచ్.పూజిత, ధర్మవరం మోడల్ స్కూల్ విద్యార్థిని కె. దుర్గా ప్రథమ, ద్వితీయస్థానాల్లో నిలిచారు.