కొర్రపోలూరు సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వలో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు బయటకు తీశారు.
ఎస్సార్బీసీ కాల్వలో వ్యక్తి మృతదేహం
Sep 18 2016 12:24 AM | Updated on Sep 4 2017 1:53 PM
గడివేముల: కొర్రపోలూరు సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వలో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు బయటకు తీశారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుంది. వీఆర్వో ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Advertisement


