ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యం | Tyler went to the shops to the disappearance of a young woman | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యం

Mar 5 2016 10:22 PM | Updated on Sep 3 2017 7:04 PM

టైలర్ షాపునకు వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన యువతి తిరిగి రాలేదు.

హైదరాబాద్: టైలర్ షాపునకు వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...లాలాగూడలోని సూపర్‌స్టార్ హోటల్ సమీపంలో నివసించే శంషుద్దీన్ కూతురు నాజియా(19) ఇంట్లోనే ఉంటోంది. అయితే ఈ నెల 4వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో టైలర్ షాపునకు వెళ్లొస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన నాజియా రాత్రయిై నా ఇంటికి తిరిగి రాలేదు.

దీంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు స్నేహితులను, బంధువులను, తెలిసిన వారిని నాజియా గురించి వాకబు చేశారు. ఫలితం కనిపించకపోవడంతో శనివారం స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement