టూ వీలర్, మొబైల్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ | Two Wheeler, mobile services with Free Training | Sakshi
Sakshi News home page

టూ వీలర్, మొబైల్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ

Jun 29 2016 1:56 AM | Updated on Sep 4 2017 3:38 AM

భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో...

జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు టూవీలర్, మొబైల్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు  ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డెరైక్టర్ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం, వ్యక్తిగత వికాస తరగతులు, స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్థానిక వెంకటేశ్వరకాలనీలోని తమ సంస్థ కార్యాలయాన్ని, 08542-270395, 9985529381  నంబర్లను సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement