పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద ఓ కారు అదుపు తప్పి హైవేపై చెట్టును ఢీకొంది.
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దెందులూరు మండలం నారాయణపురం వద్ద ఓ కారు అదుపు తప్పి హైవేపై చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రమాదానికి గురైన కారు నెంబరు AP 16 CA 1199. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.