మే 27న జరిగే తెలంగాణ రాష్ర్ట ఎడ్‌సెట్-2016 హాల్‌టికెట్లను సోమవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్: మే 27న జరిగే తెలంగాణ రాష్ర్ట ఎడ్‌సెట్-2016 హాల్‌టికెట్లను సోమవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. హాల్‌టికెట్ లేని అభ్యర్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసిన ఫ్రుఫ్‌ను (ఫీజు రసీదు/దరఖాస్తు చేసిన డౌన్‌లోడ్ కాపీ), ఒక పాస్‌ఫొటోను తీసుకుని సమీప ఎడ్‌సెట్ కేంద్రంలోని అధికారులను సంప్రదించి డూప్లికేట్ హాల్‌టికెట్ పొందవచ్చన్నారు. పరీక్షా కేంద్రానికి గంటముందుగా చేరుకోవాలని సూచించారు.