breaking news
professor prasad
-
నేటి నుంచి తెలంగాణ ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు
హైదరాబాద్: మే 27న జరిగే తెలంగాణ రాష్ర్ట ఎడ్‌సెట్-2016 హాల్‌టికెట్లను సోమవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. హాల్‌టికెట్ లేని అభ్యర్థులు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసిన ఫ్రుఫ్ను (ఫీజు రసీదు/దరఖాస్తు చేసిన డౌన్లోడ్ కాపీ), ఒక పాస్ఫొటోను తీసుకుని సమీప ఎడ్‌సెట్ కేంద్రంలోని అధికారులను సంప్రదించి డూప్లికేట్ హాల్‌టికెట్ పొందవచ్చన్నారు. పరీక్షా కేంద్రానికి గంటముందుగా చేరుకోవాలని సూచించారు. -
ఎడ్‌సెట్‌కు ఏర్పాట్లు పూర్తి
31 నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ హైదరాబాద్: టీఎస్ ఎడ్‌సెట్-2015కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓయూ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే నాటికి 64231 దరఖాస్తులు అందిన్నట్లు వివరించారు. అందులో మ్యాథ్స్‌కు 1345, ఫిజికల్సైన్స్కు 4364, బయోలాజికల్సైన్స్కు 15498, సోషల్సైన్స్కు 30436, ఇంగ్లిష్‌కు 844 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. 1347 మంది ఉర్దూ అభ్యర్థులకు హైదరాబాద్‌లో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జూన్ 6న జరిగే ఈ పరీక్షకు ఈ నెల 31 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరన్నారు.