జీఎస్టీపై భయం వీడండి | try to understand th gst | Sakshi
Sakshi News home page

జీఎస్టీపై భయం వీడండి

Aug 29 2017 1:58 AM | Updated on Sep 17 2017 6:03 PM

జీఎస్టీపై భయం వీడండి

జీఎస్టీపై భయం వీడండి

వ్యాపారుల్లో జీఎస్టీపై ఉన్న భయం వీడాలని, కొత్త చట్టంపై అవగాహన ముఖ్యమని వాణిజ్యపన్నుల శాఖ జిల్లా జాయంట్‌ కమిషనర్‌ టి.రాజశేఖర్‌ సూచించారు. వినియోగదారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ప్రక్కిలంకలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు.

తాళ్లపూడి: వ్యాపారుల్లో జీఎస్టీపై ఉన్న భయం వీడాలని, కొత్త చట్టంపై అవగాహన ముఖ్యమని వాణిజ్యపన్నుల శాఖ జిల్లా జాయంట్‌ కమిషనర్‌ టి.రాజశేఖర్‌ సూచించారు. వినియోగదారుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ప్రక్కిలంకలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీపై వ్యాపారులు, విద్యార్థుల సందేహలను జేసీ రాజశేఖర్‌ నివృత్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీఎస్టీ రావడంతో కొందరు వ్యాపారాలను మానుకోవాలా అనుకుంటున్నారని ఇది సరికాదన్నారు.

జీఎస్టీలో 5 శాతం నుంచి 12, 18, 28 శాతం వరకు పన్ను ఉందన్నారు. కొత్త విధానానికి వ్యాపారులు అలవాటు పడాలని సూచించారు. 17 రకాల పన్నులను కలిపి జీఎస్టీగా మార్చారన్నారు. వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జిల్లా కార్యరద్శి ఎంఏ అన్సారీ, సీటీఓ కె.వెంకటేశ్వరరావు, మండల రైస్‌మిల్లర్స్‌ అధ్యక్షుడు సింహద్రి జనార్దనరావు, వినియోగదారుల పరిరక్షణ సమితి సభ్యులు అప్పన రాజా, కె.మోహన్, కూచిభట్ల ప్రసాద్, పరస రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement