టీఆర్‌ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోంది: గుత్తా | TRS is buying votes: Gutta | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోంది: గుత్తా

Nov 13 2015 4:26 AM | Updated on Aug 14 2018 10:54 AM

టీఆర్‌ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోంది: గుత్తా - Sakshi

టీఆర్‌ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోంది: గుత్తా

వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు.

నల్లగొండ టూటౌన్: వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. మంత్రులు వరంగల్‌లో తిష్టవేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామ, మండలస్థాయి నాయకులను, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ స్థానికేతరుడని ప్రచారం చేస్తున్నారని, దేశంలో పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ వారు దిగజారిపోయి మాట్లాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారంలో 5 రోజులు ఫాంహౌస్‌లోనే ఉంటున్నారని, పండగలు, పబ్బాలు, యాగాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement