మొరాయించిన తిరుపతి ప్యాసింజర్‌ | trouble of tirupati passenger | Sakshi
Sakshi News home page

మొరాయించిన తిరుపతి ప్యాసింజర్‌

Apr 29 2017 11:43 PM | Updated on Sep 5 2017 9:59 AM

గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్‌ రైలు (57476) గూళపాళ్యం రైల్వేస్టేషన్‌లో మొరాయించింది.

గుంతకల్లు : గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్‌ రైలు (57476) గూళపాళ్యం రైల్వేస్టేషన్‌లో మొరాయించింది. దీంతో సుమారు 2 గంటలు ఆలస్యంగా నడిచింది. వివరాలు.. ఉదయం 7.15 గంటలకు గుంతకల్లు నుంచి బయలుదేరిన రైలు గూళపాళ్యం రైల్వేస్టేషన్‌ వద్ద నిలిచిపోయింది. ఇంజన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రైలు ఆగినట్టు అధికారులు తెలిపారు. అయితే గుంతకల్లు నుంచి మరో ఇంజన్‌ పంపి రైలుకు అటాచ్‌ చేయగా 9.30 గంటలకు రైలు కదిలింది.

Advertisement
 
Advertisement
Advertisement