ప్రజాకవి గూడ అంజన్న ఆశయాలను కొనసాగించాల్సి బాధ్యత నేటి తరంపై ఉందని వరసం జిల్లా కన్వీనర్ నల్లెల్ల రాజయ్య అన్నారు. బహుజన సాంస్కృతిక సమాఖ్య అధ్వర్యంలో హన్మకొండలోని శ్రీరాజరాజనరేంద్ర బాషా నిలయంలో ఆదివారం మధ్యాహ్నం సమాఖ్య వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సుధమల్ల అశోక్ అధ్యక్షతన జరిగింది.
ప్రజాకవి గూడ అంజన్న ఆశయాలను కొనసాగిద్దాం
Jul 24 2016 11:11 PM | Updated on Sep 4 2017 6:04 AM
హన్మకొండ కల్చరల్ : ప్రజాకవి గూడ అంజన్న ఆశయాలను కొనసాగించాల్సి బాధ్యత నేటి తరంపై ఉందని వరసం జిల్లా కన్వీనర్ నల్లెల్ల రాజయ్య అన్నారు. బహుజన సాంస్కృతిక సమాఖ్య అధ్వర్యంలో హన్మకొండలోని శ్రీరాజరాజనరేంద్ర బాషా నిలయంలో ఆదివారం మధ్యాహ్నం సమాఖ్య వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సుధమల్ల అశోక్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పలువురు యువకవులు మాట్లాడుతూ అంజన్నకు రావల్సిన గుర్తింపు రాలేదని అన్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు రమాదేవి, బందెల సదానందం, బొడ్డు కుమారస్వామి, పోలాటి రాజు, ముత్యం రాజు, సామల శ్రీధర్, గురిమిల్ల రాజు, బూజుగుండ్ల శ్రీనివాస్, కుడికాల శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువకులు పాడిన పాటలు అలరించాయి.
Advertisement
Advertisement