అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న గృహ వినియోగదారులపై బుధవారం ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారుల దాడులు
Feb 23 2017 12:28 AM | Updated on Sep 5 2017 4:21 AM
- 70 కేసులు నమోదు
- రూ.3.55 లక్షల జరిమానా
ఉయ్యాలవాడ: అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న గృహ వినియోగదారులపై బుధవారం ట్రాన్స్‌కో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 70 కేసులు నమోదు చేసి, రూ. 3.55 లక్షలు జరిమానా విధించినట్లు స్థానిక ఏఈ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు విజిలెన్స్ డీఈ ఉమాపతి ఆధ్వర్యంలో ఏడీఈ శ్రీనివాసరెడ్డి, ముగ్గురు ఏఈలు, సిబ్బందితో కలిసి మండలంలోని అల్లూరు, మాయలూరు, ఉయ్యాలవాడ, సుద్దమల్ల, రూపనగుడి, కోవెలకుంట్ల మండలంలోని గుళ్లదుర్తి గ్రామాల్లో దాడులు నిర్వహించి అక్రమంగా విద్యుత్ కనెక్షన్‌లు కలిగి వున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు ఏఈ స్పష్టం చేశారు.
Advertisement
Advertisement