రంపచోడవరం మండలం బూసిగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బుడమల భూలక్ష్మి( 15) గురువారం గుండె పోటుతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందింది. పాఠశాలలో బుధవారం గుండె నొప్పి రావడంతో బాలికను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రా««థమిక చి
గుండెపోటుతో గిరిజన బాలిక మృతి
Nov 4 2016 11:55 PM | Updated on Sep 4 2017 7:11 PM
రంపచోడవరం:
రంపచోడవరం మండలం బూసిగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బుడమల భూలక్ష్మి( 15) గురువారం గుండె పోటుతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందింది. పాఠశాలలో బుధవారం గుండె నొప్పి రావడంతో బాలికను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రా««థమిక చికిత్స అనంతరం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఏజెన్సీలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందకపోవడంతో చిన్నపాటి వ్యాధులకు సైతం అనారోగ్యం పాలవుతున్నారు.
Advertisement


