18న గుడాటిపల్లికి టీపీసీసీ నేతలు | tpcc leaders at gudatipally on 18 | Sakshi
Sakshi News home page

18న గుడాటిపల్లికి టీపీసీసీ నేతలు

Sep 10 2016 11:52 PM | Updated on Sep 4 2017 12:58 PM

గౌరవెల్లి ముంపు ప్రాంతంలో పర్యటించి తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సునీతాలక్ష్మారెడ్డిని భూనిర్వాసితులు శనివారం కలిసి విన్నవించారు.

హుస్నాబాద్‌రూరల్‌ : గౌరవెల్లి ముంపు ప్రాంతంలో పర్యటించి తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సునీతాలక్ష్మారెడ్డిని భూనిర్వాసితులు శనివారం కలిసి విన్నవించారు. గుడాటిపల్లిలో 60 రోజులుగా దీక్షలు చేపట్టిన ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న గౌరవెల్లి ముంపు ప్రాంతంలో పర్యటించనున్నట్లు నేతలు తెలిపారని భూనిర్వాసితులు పేర్కొన్నారు. కలిసిన వారిలో జి.రాజిరెడ్డి, చంద్రారెడ్డి, ఎన్‌.బాల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, రాజిరెడ్డి, రమేశ్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, బాపురెడ్డి, భిక్షపతి ఉన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement