గొంతులోకి టూత్‌ బ్రష్‌ | tooth brush in neck | Sakshi
Sakshi News home page

గొంతులోకి టూత్‌ బ్రష్‌

Feb 12 2017 10:35 PM | Updated on Sep 5 2017 3:33 AM

గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ కుమారుడు హర్షవర్ధన్‌ ఆదివారం ఉదయం పళ్లు శుభ్రం చేసుకునేందుకు బ్రష్‌ చేసుకుంటుండగా పొరపాటున అది గొంతులోకి జారింది.

మారాల (బుక్కపట్నం) : గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ కుమారుడు హర్షవర్ధన్‌ ఆదివారం ఉదయం పళ్లు  శుభ్రం చేసుకునేందుకు బ్రష్‌  చేసుకుంటుండగా పొరపాటున అది గొంతులోకి జారింది. బాలుడి తల్లీదండ్రులు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. బాలుడు అవ్వతాతల వద్ద ఉంటున్నాడు.  విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు రామ్మోహన్‌ ఆ బాలుడ్ని అనంతపురంలోని ఈఎన్‌టీ డాక్టర్‌ శ్రీనాథ్‌ వద్దకు తీసుకెళ్లారు. ఆయన చికిత్స చేసి బ్రష్‌ను బయటకు తీశారు. బాలుడికి ప్రాణాపాయం తప్పడంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement