సానుభూతిపరులకు టూర్‌.. | toor for movisit simpathimember | Sakshi
Sakshi News home page

సానుభూతిపరులకు టూర్‌..

Jul 29 2016 10:19 PM | Updated on Sep 4 2017 6:57 AM

మావోయిస్టు పార్టీ సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటవీగ్రామాలకు చెందిన సుమారు రెండు వందల మంది మావోయిస్టు సానుభూతిపరులకు ఈ వారం రోజులపాటు విహారయాత్ర ఏర్పాటు చేశారు.

కాళేశ్వరం : మావోయిస్టు పార్టీ సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటవీగ్రామాలకు చెందిన సుమారు రెండు వందల మంది మావోయిస్టు సానుభూతిపరులకు ఈ వారం రోజులపాటు విహారయాత్ర ఏర్పాటు చేశారు. ఈనెల 28నుంచి ఆగస్టు 3వరకు మావోయిస్టు పార్టీ సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా డీఎస్పీ శివాజీపవార్‌ నేతృత్వంలో ఎస్సైలు కదం, బీల్‌దార్‌ సిరొంచ తాలుకాలోని 120 అటవీ గ్రామాలకు చెందిన రెండు వందల మంది మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తిరిగి మావోయిస్టు పార్టీవైపు ఆకర్షితులు కాకుండా విహారయాత్ర ఏర్పాటు చేశారు. సానుభూతిపనులను శుక్రవారం కాళేశ్వరం దర్శనానికి తీసుకొచ్చారు. వారోత్సవాలు ముగిసేంత వరకు వీరిని వివిధ ప్రాంతాల్లో తిప్పుతామని ఎస్సైలు కదం, బీల్‌దార్‌ తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement