రేపు ‘ఆయుష్‌’ వైద్యుల సమావేశం | tomorrow ayush doctors meeting | Sakshi
Sakshi News home page

రేపు ‘ఆయుష్‌’ వైద్యుల సమావేశం

Sep 22 2017 10:25 PM | Updated on Sep 22 2017 11:13 PM

రేపు ‘ఆయుష్‌’ వైద్యుల సమావేశం

అనంతపురం మెడికల్‌: నేషనల్‌ ఆయుష్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (నామా) జిల్లా కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ‘ఆయుష్‌’ వైద్యుల సమావేశం నిర్వహించనున్నట్లు నామా రాష్ట్ర నేతలు డాక్టర్‌ తిరుపతినాయుడు, కుమారయ్య, గోకుల్‌ నాగేశ్వరరావు తెలిపారు. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న పీవీకేకే పీజీ కళాశాలలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయుష్‌ వైద్యుల సమస్యలు, పారామెడికల్‌ సమస్యలు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం, ఆర్‌బీఎస్‌కే తదితర వాటిపై చర్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులంతా హాజరుకావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement