ఐశ్వర్య ప్రదాయిని.. వరలక్ష్మీ | today varalaxmi vratham | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య ప్రదాయిని.. వరలక్ష్మీ

Aug 3 2017 7:59 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఐశ్వర్య ప్రదాయిని.. వరలక్ష్మీ - Sakshi

ఐశ్వర్య ప్రదాయిని.. వరలక్ష్మీ

శ్రావణం దేవతలకు ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ముత్తైదువలు దీర్ఘ సుమంగళీతనం కోసం భర్తతో కలిసి ఆచరించే వరమమాలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది.

సందర్భం– నేడు వరలక్ష్మీ వ్రతం

అనంతపురం కల్చరల్‌ : శ్రావణం దేవతలకు ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ముత్తైదువలు దీర్ఘ సుమంగళీతనం కోసం భర్తతో కలిసి ఆచరించే  వరమమాలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి మొదట వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఎనిమిది విధాల సకల సౌభాగ్యాలనిచ్చే అష్టలక్ష్ములకు మహిళలు పూజిస్తారు. జిల్లాలోని వివిధ ఆలయాలతో పాటు నగరంలోని స్థానిక పాతూరులో వెలసిన ఏకైక మహాలక్ష్మీ ఆలయంలో వ్రత వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొండెక్కిన పూల ధరలు
వరలక్ష్మి వ్రతం సందర్భంగా గురువారం సాయంత్రం నుండే నగరంలోని పలు చోట్ల మామిడాకులు, పళ్లు, పూల దుకాణాలు కిటకిటలాడాయి. అన్ని రకాల పూల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఒక కేజీ కనకాంబరాలు రూ.150, గులాబీలు రూ.300, మల్లెలు రూ. 130 కాగా చామంతి పూలు రూ. 400 పలుకుతున్నా ప్రజలు పెద్ద ఎత్తున కొంటున్నారు.

వరలక్ష్మీ విధానం ఇలా ఆచరిద్దాం..
సాధారణంగా శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. ఆ రోజున వీలు కాకపోతే శ్రావణంలో వచ్చే ఏ శుక్రవారమైనా దీనిని ఆచరించుకోవచ్చు.

- వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే వారు ఆరోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
- పూజా మందిరంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకుని దానిపై బియ్యపు పిండితో ముగ్గు వేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి.
- పసుపు రాసుకున్న తెల్లటి దారాలను ఐదు లేదా తొమ్మిదిపోగులు తీసుకుని తోరాలుగా చేసుకున్న వాటిని చేతికి కట్టుకోవాలి.
- తొలుత గణపతి పూజలతో ప్రారంభించి అమ్మవారిని అష్టోత్తర నామాలకు  అనుగుణంగా  పూజించాలి.
- పాలు, పండ్లు, గంధం, వివిధ రకాల పూలను అమ్మవారికి సమర్పించాలి.
- దీపారాధనలో అమ్మవారి ప్రతిరూపంగా ఉంటుందని కనుక మహా మంగళహారతి ఇవ్వాలి.
- వ్రత కథలను శ్రద్ధగా విన్న తర్వాత  ఐదు మంది ముత్తైదువులను పిలిచి చందన తాంబూలిస్తే ఆ ఇంట సిరులొలుకుతాయని అందరి విశ్వాసం.

సకల ఐశ్యర్యాలు కలుగుతాయి
సహజంగా మహిళలకు పుట్టింటిపై మమకారం ఉంటుంది. ఇదే విషయాన్ని వరలక్ష్మి వ్రతం ప్రతిబింభిస్తుంది.  ఈ వ్రతం నిష్టగా జరుపుకునే వారికి  పుట్టినింటిలో, మెట్టినింటిలో అపూర్వ ఆదరణ, ఆప్యాయతలు, సకల ఐశ్యర్యాలు కలుగుతాయని అందరి నమ్మకం.
–రమాదేవి, గృహిణి, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement