ఎస్వీఐటీలో నేడు ఆన్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ | today on campus drive in svit | Sakshi
Sakshi News home page

ఎస్వీఐటీలో నేడు ఆన్‌ క్యాంపస్‌ డ్రైవ్‌

Mar 17 2017 11:51 PM | Updated on Sep 5 2017 6:21 AM

మండలంలోని హంపాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్‌ కళాశాలలో నేడు(శనివారం) ఆన్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్‌ సి. సోమశేఖర్‌రెడ్డి తెలిపారు.

హంపాపురం (రాప్తాడు) : మండలంలోని హంపాపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్వీఐటీ) ఇంజినీరింగ్‌ కళాశాలలో నేడు(శనివారం) ఆన్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల చైర్మన్‌ సి. సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వైస్‌ చైర్మన్‌ సి. చక్రధర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ టి. సోమశేఖర్‌రెడ్డితో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బెంగళూరుకు చెందిన ‘ట్రైజెంటో సాఫ్ట్‌వేర్‌ సొల్యుషన్స్‌’ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.

ఇంజినీరింగ్‌ నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈడ్రైవ్‌కు అర్హులని తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు ఇంటర్య్యూలు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైన విద్యార్థులు బెంగళూరులో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని, వార్షిక ఆదాయం రూ. 2.40 లక్షలు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ సత్యశ్రీ, పీడీ శ్రీనివాస్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement