ఎస్వీఐటీలో నేడు మైక్రోసాప్ట్‌ కంపెనీ జాబ్‌మేళా | today jobmela in svit | Sakshi
Sakshi News home page

ఎస్వీఐటీలో నేడు మైక్రోసాప్ట్‌ కంపెనీ జాబ్‌మేళా

Aug 16 2017 7:29 PM | Updated on Sep 12 2017 12:14 AM

మండలంలోని హంపాపురం సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ (ఎస్వీఐటీ) కళాశాలలో మైక్రోసాప్ట్‌ కంపెనీ తరఫున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ టి. సూర్యశేఖరరెడ్డి తెలిపారు.

రాప్తాడు(కనగానపల్లి): మండలంలోని హంపాపురం సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ (ఎస్వీఐటీ) కళాశాలలో మైక్రోసాప్ట్‌ కంపెనీ తరఫున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ టి. సూర్యశేఖరరెడ్డి తెలిపారు.  స్థానిక కళాశాలలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మైక్రోసాప్ట్‌ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఆ కంపెనీ ఉప సంస్థ క్లెంట్‌ బైనరీ టైటాన్స్‌ ద్వారా ఈ ఉద్యోగ నియామకాలు చేపడుతోందన్నారు. బీటెక్‌ ఫైనల్‌ చదువుతున్న అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులు ఈ నియామకాల్లో పాల్గొనవచ్చన్నారు. కంపెనీ ప్రతినిధులు గురువారం ఎస్వీఐటీ కళాశాల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకొని అర్హులైన వారికి రాత, మౌఖిక పరీక్షలతో పాటు గ్రూపు చర్చలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో కళాశాల వైఎస్‌ చెర్మెన్‌ చక్రధర్‌రెడ్డి, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement