నేడు లైఫ్‌మిత్ర ఉద్యోగాలకు మేళా | today jobmela of life mithra | Sakshi
Sakshi News home page

నేడు లైఫ్‌మిత్ర ఉద్యోగాలకు మేళా

Jun 13 2017 8:01 PM | Updated on Sep 5 2017 1:31 PM

ఎస్‌బీఐ లైఫ్‌ మిత్ర ఇన్సూరెన్స్‌కు సంబంధించిన లైఫ్‌మిత్ర ఉద్యోగాలకు బుధవారం మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఎస్‌బీఐ లైఫ్‌ మిత్ర ఇన్సూరెన్స్‌కు సంబంధించిన లైఫ్‌మిత్ర ఉద్యోగాలకు బుధవారం మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎ.కళ్యాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు అర్హులని, అనంతపురం, హిందూపురం, ధర్మవరం శాఖల పరిధిలో పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నెలసరి జీతం రూ. 15 వేలు ఉంటుందని వివరించారు.ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 10.30 గంటలకు విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, పాన్‌కార్డు, ఆధార్‌కార్డుతో హాజరుకావాలని ఆమె సూచించారు.

Advertisement

పోల్

Advertisement