ఆలయాన్ని అప్పగించాలని ఆత్మహత్యాయత్నం
భక్తుల సహకారం, కాయకష్టం కలుపుకుని నిర్మించిన ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వెంటనే తమకు అప్పగించాలనే డిమాండ్‌తో ఆలయ వ్యవస్థాపకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
-
దిగొచ్చిన దేవాదాయ శాఖ అధికారులు
పోచమ్మమైదాన్ : భక్తుల సహకారం, కాయకష్టం కలుపుకుని నిర్మించిన ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, వెంటనే తమకు అప్పగించాలనే డిమాండ్‌తో ఆలయ వ్యవస్థాపకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
కొద్దిరోజుల నుంచి ఈ వివాదం సాగుతుండగా, బాధ్యులు గురువారం ఆత్మహత్యకు యత్నించడంతో అధికారులు దిగొచ్చి ఆలయ తాళాలు అప్పగించారు. వరంగల్ రంగంపేటలోని అయ్యప్ప ఆలయాన్ని సుబ్రమణ్యశర్మ, గణేష్‌శర్మ నిర్మించినట్లు చెబుతుండగా వారి ఆధ్వర్యంలో నిర్వహ ణ సాగింది. కొన్నినెలల క్రితం ఆలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోగా, నిరక్షరాస్యులమైన తమతో అన్యాయంగా సంతకాలు చేయించుకున్నారని వ్యవస్థాపకులు ఆరోపిస్తూ హైకోర్టుకు వెళ్లారు. దీంతో అధికారుల నిర్ణయంపై స్టే విధిస్తూ, ఆలయ నిర్వహణను సుబ్రమణ్యశర్మకే అప్పగించాలని ఆదేశిం చింది. దీంతో సుబ్రహ్మణ్య శర్మ, గణేష్ శర్మలు దేవాదా య శాఖ కమిషనర్ కృష్ణవేణిని కలిసి ఆలయ తాళాలు ఇప్పించాలని కోరగా ఆమె ఏసీ వీరస్వామికి ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆయన ఇవ్వకపోవడంతో విసిగిపోయి న వారు దేవాదాయ శాఖ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకని ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డారు. దీంతో దిగొచ్చిన అధికారులు ఆలయ తాళాలు అప్పగించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం వారు ఆలయంలో పూజలు నిర్వహించారు.