ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : విజయదశమి పండగ నేపథ్యంలో జిల్లా నుంచి హైదరాబాద్‌కు 74 ప్రత్యేక సర్వీసులు నడ పనున్నట్టు ఆర్టీసీ ఏలూరు రీజియన్ డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.మురళీకృష్ణ తెలిపారు.
హైదరాబాద్‌కు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
Sep 30 2016 12:31 AM | Updated on Oct 1 2018 6:33 PM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : విజయదశమి పండగ నేపథ్యంలో జిల్లా నుంచి హైదరాబాద్‌కు 74 ప్రత్యేక సర్వీసులు నడ పనున్నట్టు ఆర్టీసీ ఏలూరు రీజియన్ డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.మురళీకృష్ణ తెలిపారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, భీమవరం, నరసాపురం డిపోల నుంచి సాధారణ రోజుల్లో మొత్తం హై దరాబాద్‌కు 34 బస్సులు నడుస్తున్నాయన్నారు. దసరా సందర్భంగా వచ్చే నెల 4న 5 బస్సులను, 5న 5 , 6న 10, 7న 25, 8న 20 ప్రత్యేక సర్వీసులను తిప్పనున్నట్టు చెప్పారు. సెలవుల్లో జిల్లాకు వచ్చి హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు ఇప్పటికే రిజర్వేషన్లు చేయించుకున్నట్టు చెప్పారు. సీట్ల ఖాళీలు లేవని, డిమాండ్‌ను బట్టి ప్రత్యేక సర్వీసులు కేటాయిస్తామని వివరించారు. మొహర్రం నేపథ్యంలో 12వ తేదీన సాధారణ బస్సులకు తోడు 30 అదనపు సర్వీసులు నడపనున్నట్టు చెప్పారు. గతేడాది దసరా సందర్భంగా జిల్లా నుంచి 100 ప్రత్యేక సర్వీసులు నడిపామని మురళీకృష్ణ వివరించారు..
Advertisement
Advertisement