పాఠశాల భూమి ఆక్రమించారని కలెక్టర్‌కు వినతి | to collector memorandum in school land aqqupei | Sakshi
Sakshi News home page

పాఠశాల భూమి ఆక్రమించారని కలెక్టర్‌కు వినతి

Sep 8 2016 1:08 AM | Updated on Mar 21 2019 8:35 PM

నకిరేకల్‌ మండలం తాటికల్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని జెడ్పీహైస్కూల్, ప్రాథమిక పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్‌లు చెనగాని సైదమ్మ, సిహెచ్‌ అండాలు ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

నకిరేకల్‌ :  నకిరేకల్‌ మండలం తాటికల్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని జెడ్పీహైస్కూల్, ప్రాథమిక పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్‌లు చెనగాని సైదమ్మ, సిహెచ్‌ అండాలు ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఆ వివరాలను నకిరేకల్‌లో వెల్లడించారు. గ్రామపరిధిలోని ప్రభుత్వ జెడ్పీహైస్కూల్, ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన భూమిని కొందరు గ్రామస్తులు ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. భూమిపై పూర్తి విచారణ జరిపి పాఠశాలకు వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వినతి పత్రం అందించిన వారిలో తాటికల్‌ సర్పంచ్‌ చెనగాని మంజుల సుధాకర్, ఎంపీటీసీ మిర్యాల చంద్రశేఖర్, ఉప సర్పంచ్‌ నిమ్మనగోటి సైదులు, మొగిలి ఉపేందర్, చెనగాని కష్ణ, పిట్టల శ్రావణి, కొండయ్య, జానయ్య, శ్రీధర్, రాంబాబు, ఎల్లయ్య, లింగయ్య, శ్రీను, రామలింగయ్య, నగేష్‌ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement