వెయ్యి నోట్లు విసిరేశాడు | Threw a thousand notes | Sakshi
Sakshi News home page

వెయ్యి నోట్లు విసిరేశాడు

Nov 12 2016 3:16 AM | Updated on Sep 4 2017 7:50 PM

వచ్చీపోయే యాత్రికుల సందడి నడుమ కారులో వెళుతున్న ఓ వ్యక్తి రూ.వెయ్యి నోట్లను రోడ్డుపైకి విసిరేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో శుక్రవారం చోటుచేసుకుంది.

- కారులోంచి విసురుకుంటూ వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి
- తీసుకొనేందుకు పరుగులు పెట్టిన జనం

 ద్వారకాతిరుమల: వచ్చీపోయే యాత్రికుల సందడి నడుమ కారులో వెళుతున్న ఓ వ్యక్తి రూ.వెయ్యి నోట్లను రోడ్డుపైకి విసిరేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ సమయంలో అటుగా వెళుతున్న కొందరు వాటిని తీసుకోవడానికి పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలోని ఎస్‌వీఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఒక మెకానిక్ షెడ్డు ప్రాంతంలో ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్షకు పైగా విలువైన రూ.వెరుు్య నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వేగంగా వెళ్లిపోయాడు.

ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. వాటిని దక్కించుకున్న వారిలో కొందరు అవి నిజమైన నోట్లా.. కాదా అనే సందేహంతో పెట్రోల్ బంకుల వైపుకు పరుగులు తీశారు. అక్కడ అవి చెల్లడంతో నిజమైన నోట్లేనని నిర్ధారించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement