గుంటూరు జిల్లా తెనాలి పట్టణ సమీపంలోని రైతానగర్ చెరువులో పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణ సమీపంలోని రైతానగర్ చెరువులో పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. గురువారం ఉదయం చెరువు వద్దకు ఆడుకుంటూ వెళ్లిన బాలురు నీటిలోకి దిగారు. ఆ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉండటంతో వారు మునిగిపోయారు. కొంతసేపటి తర్వాత కుటుంబసభ్యులు వెతకగా వారి మృతదేహాలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.