రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.
నరసాపురం(పశ్చిమగోదావరి): రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని థామస్ వంతెనపై ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. నరసాపురం పట్టణానికి చెందిన కర్రా గంగరాజు పల్సర్‌పై వెళుతూ ఎదురుగా మరో వస్తున్న మరో పల్సర్‌ను ఢీకొట్టాడు.
దీంతో రెండు బైక్లపై ఉన్న కర్రా గంగరాజు, మొగల్తూరుకు చెందిన పాలనాగరాజు, కడవి పండు సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందారు.