ప్రభుత్వంలో ముగ్గురు నయీంలు | they are three gangsters | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంలో ముగ్గురు నయీంలు

Aug 20 2016 10:00 PM | Updated on Sep 4 2017 10:06 AM

మాసాయిపేటలో మాట్లాడుతున్న ప్రతాప్‌రెడ్డి

మాసాయిపేటలో మాట్లాడుతున్న ప్రతాప్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు, డాన్లుగా మారారని ప్రతాప్‌రెడ్డి పరోక్షంగా అన్నారు.

తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

వెల్దుర్తి(మెదక్):  గ్యాంగ్‌స్టర్‌ నయీంను మించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఆ ముగ్గురు డాన్లుగా మారారని తెలుగు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి  పరోక్షంగా  మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ఎంపీ కవితను ఉద్దేశించి అన్నారు. శనివారం మాసాయిపేటలో మండలం కోసం దీక్షలు చేస్తున్న శిబిరం వద్దకు ఆయన వచ్చి  సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి సునితాలక్ష్మారెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. సీఎం సొంత  నియోజకవర్గంలో అధికారుల వేధింపులకు ఎస్ఐ బలికావడం దారుణమని ప్రతి శాఖలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. 

మంత్రి హరీశ్‌రావు మాఫియాగా మారి ప్రతిశాఖలో కమిషన్లు దండుకుంటూ  రూ. కోట్లు పోగుచేసి భూ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాలను, నియోజకవర్గాలు, మండలాలు ఏర్పాటు చేయాల్సింది పోయి  స్వలాభం కోసం 24 ముక్కలుగా చేస్తున్నారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement