వారు తోడుదొంగలు | They are accomplice | Sakshi
Sakshi News home page

వారు తోడుదొంగలు

Jun 28 2016 3:02 AM | Updated on Aug 14 2018 11:26 AM

వారు తోడుదొంగలు - Sakshi

వారు తోడుదొంగలు

తెలంగాణ ప్రయోజనాల ను కొందరు లం గలు ఆంధ్ర నేతల కు తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాగం, రేవంత్‌లపై జూపల్లి ధ్వజం

 కొల్లాపూర్: తెలంగాణ ప్రయోజనాల ను కొందరు లం గలు ఆంధ్ర నేతల కు తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి మాట్లాడుతూ నాగం జనార్దన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, డీకే అరుణలపై పరుష పదజాలంతో ధ్వజమెత్తారు.

పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రాలో తీర్మా నం చేస్తే  రేవంత్, రమణ దాన్ని వ్యతిరేకించకుండా సభలో బాబుకు స్వీట్లు తిని పించారని మండిపడ్డారు.  నాగం, రేవంత్‌లిద్దరూ తోడు దొంగలని, వీరు చంద్ర బాబుకు వంతపాడుతూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టును జూరాల వద్ద నుంచి కొల్లాపూర్‌కు కమీషన్ల కోసమే మార్చారని విమర్శలు చేస్తున్నవారికి మెదడు ఉందో లేదోనని డీకే అరుణ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement