రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహం | The woman 's body Found on the railway track | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహం

Aug 19 2016 7:43 PM | Updated on Sep 4 2017 9:58 AM

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్‌పై మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగింది.

ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో రైల్వే ట్రాక్‌పై మృతిచెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం వెలుగుచూసింది. రెలు ఢీకొని మృతిచెందిన ఆనవాళ్లు లేకపోవడంతో.. ఎవరో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు స్థానికంగా నివాసముండే బానోతు అరుణ(25)గా పోలీసులు నిర్ధరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement