గాలిమరల టవర్‌పై నుంచి పడి టెక్నీషియన్‌ మృతి | The technician died from a windmill tower | Sakshi
Sakshi News home page

గాలిమరల టవర్‌పై నుంచి పడి టెక్నీషియన్‌ మృతి

Aug 9 2017 10:52 PM | Updated on Sep 17 2017 5:21 PM

గాలిమరల టవర్‌పై నుంచి పడి టెక్నీషియన్‌ మృతి

గాలిమరల టవర్‌పై నుంచి పడి టెక్నీషియన్‌ మృతి

గాలిమరల టవర్‌పై పని చేస్తుండగా పట్టు తప్పి టెక్నీషియన్‌ కిందపడటంతో మృతి చెందాడు. ఎస్‌ఐ రామారావు తెలిపిన మేరకు.. విన్‌సోల్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ కంపెనీ దుబ్బార్లపల్లి వద్ద గాలిమరల ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం గాలిమరల టవర్‌పైకి ఎక్కి పనిచేస్తున్న టెక్నీషియన్‌ సహారా యోగేష్‌ (20) పట్టు తప్పి కిందపడ్డాడు.

రామగిరి: గాలిమరల టవర్‌పై పని చేస్తుండగా పట్టు తప్పి టెక్నీషియన్‌ కిందపడటంతో మృతి చెందాడు. ఎస్‌ఐ రామారావు తెలిపిన మేరకు.. విన్‌సోల్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ కంపెనీ దుబ్బార్లపల్లి వద్ద గాలిమరల ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం గాలిమరల టవర్‌పైకి ఎక్కి పనిచేస్తున్న టెక్నీషియన్‌ సహారా యోగేష్‌ (20) పట్టు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడు మహారాష్ట్రలోని వార్తాడు జిల్లాకు చెందిన పొరగామ్‌ గ్రామానికి చెందినవాడని ఎస్‌ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement