ప్రభుత్వ పాఠశాలలో పురాతన లాకర్‌ | The oldest locker at governament school | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలో పురాతన లాకర్‌

Aug 27 2016 1:01 AM | Updated on Sep 4 2017 11:01 AM

ప్రభుత్వ పాఠశాలలో పురాతన లాకర్‌

ప్రభుత్వ పాఠశాలలో పురాతన లాకర్‌

హన్మకొండలోని డీఈవో కార్యాలయం పక్కనే ఉన్న సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాత భవనాన్ని కూల్చే క్రమంలో ఓ గది గోడ తొలగించగా ఐరన్‌ లాకర్‌ బాక్స్‌(త్రిజోరి) బయటపడిం ది. అయితే, రెండు రోజుల క్రితం ఇది బయటపడినా శుక్రవారం విషయం వెలుగుచూసింది.

  • విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకపోవడంపై అనుమానాలు 
  • పరిశీలించిన ఆర్‌డీఓ, తహసీల్దార్, అధికారులు
  • ఉన్నతాధికారుల అనుమతితో తెరిచిన వైనం
  • బయటపడిన నిజాం కాలం నాటి పత్రాలు, పహణీలు, కొన్ని చెక్కులు
  • విద్యారణ్యపురి : హన్మకొండలోని డీఈవో కార్యాల యం పక్కనే ఉన్న సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశా ల పాత భవనాన్ని కూల్చే క్రమంలో ఓ గది గోడ తొల గించగా  ఐరన్‌ లాకర్‌ బాక్స్‌(త్రిజోరి) బయటపడిం ది. అయితే, రెండు రోజుల క్రితం ఇది బయటపడినా శుక్రవారం విషయం వెలుగుచూసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. ఉదయం అధికారులు పరిశీలించి లాకర్‌ను సీజ్‌ చేశారు. అయితే, రకరకాల పుకార్లు రావడంతో జిల్లా అధికార యం త్రాంగం ఆదేశాల మేరకు సాయంత్రం త్రిజోరి తలుపులు తెరవగా నిజాం కాలం నాటి పత్రాలు, పహణీలు, కొన్ని చెక్కులు బయటపడ్డాయి. ఈ మేరకు వివరాలిలా ఉన్నాయి.
     
    పాత భవనం కూల్చివేతలో..
    సుబేదారి ఉన్నత పాఠశాల ఆవరణలోని పాత భవనాల్లోని గదుల కూల్చివేతకు ఇటీవల కలెక్టర్‌ ఆదేశాలు ఇవ్వగా ఓ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు. రెం డు రోజుల క్రితం కూల్చివేతలు ప్రారంభం కాగా.. ఆ భవనంలోనే హెచ్‌ఎం గది ఉంది. అయితే, ఈ గది కూడా కూల్చివేయాల్సి ఉండడంతో అందులోని సామగ్రిని హెచ్‌ఎం ఇజ్రాయల్‌ బయటికి తీయిస్తున్నారు. ఈ మేరకు గదిలో ఓ మూలకు గోడలో ఐరన్‌ లాకర్‌ బాక్స్‌ బుధవారం బయటపడినా ఎవరికీ చెప్పలేదు. కానీ శుక్రవారం ఉదయం ఆ బాక్స్‌ను ఫిజికల్‌ డైరెక్టర్‌ వెంకన్న, ఇద్దరు విద్యార్థులు కలిసి మరో గదిలోకి తీసుకువెళ్లారు. దీనిని గమనించిన అదే ఆవరణలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం నరేందర్‌నాయక్‌ విషయాన్ని డీఈఓ రాజీవ్, ఎంఈఓ వీరభద్రనాయక్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా విష యం బయటకు పొక్కడంతో అందులో గుప్తనిధులు ఉన్నాయంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి.
     
    ఈ మేరకు వరంగల్‌ ఆర్‌డీఓ వెంకటమాధవరెడ్డి, హన్మకొండ తహసీల్దార్‌ రాజ్‌కుమార్, హన్మకొండ ఎంఈ వో వీరభద్రనాయక్, ఎమ్మార్వో రాజకుమార్, సీఐ సతీష్, ఎస్‌ఐ సుబ్రమణ్యేశ్వర్‌రావు, కార్పొరేటర్‌ కేశిరె డ్డి మాధవి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భం గా వారు హెచ్‌ఎం ఇజ్రాయిల్, పీడీ వెంకన్నతో పాటు విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లాకర్‌ బాక్స్‌పై హైదరాబాద్‌ ఆల్విన్‌ మెటల్‌ వర్క్స్‌ లిమిటెడ్‌ అని రాసి ఉంది. కాగా, ఇప్పటి సుబేదారి  ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థానంలో దశాబ్దాల కిందట డిప్యూటీ డీఈవోల ఈస్ట్, వెస్ట్‌ కార్యాలయాలు ఉండేవని తెలుస్తోంది. అప్పట్లో విలువైన పత్రాలు, నగదు దాచేందుకు ఈ లాకర్‌ ఉపయోగించినట్లు సమాచారం. అయితే, లాకర్‌ బయటపడిన విషయా న్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లకపోవడంపై టీటీయూ జిల్లా జనరల్‌ సెక్రటరీ నరేందర్‌నాయక్, టీయూటీఎఫ్‌ జిల్లా బాధ్యులు బాబు తదితరులు అనుమానాలు వ్యక్తం చేశారు.
     
    నిజాం నాటి పత్రాలు..
    వరంగల్‌ : పాత సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని పాత భవనం గోడలో బయటపడిన త్రి జోరి(ఐరన్‌ లాకర్‌)లో నిజాం కాలం నాటి పత్రాలు వెలుగు చూశాయి. లాకర్‌ బయటపడగా అందులో ఏముందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. దీంతో లాకర్‌ను తెరిచేందుకు జిల్లా యంత్రాంగం నుంచి శు క్రవారం సాయంత్రం అనుమతి లభించింది. ఈ మేర కు హన్మకొండ తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో లాకర్‌ తెరిచారు. ఇందులో నిజాం కాలం నాటి పత్రాలు, భూములకు సంబంధించిన పహాణీలు, హైదరాబాద్‌ ఆఫ్‌ బ్యాంకుకు సంబంధించిన కొన్ని చెక్కులు లభ్యమయ్యాయి. విలువైన వస్తువులు, సమాచారం లభ్యంకాకపోవడంతో దొరికిన వస్తువులను పంచానామా చేసి భద్రపర్చారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement