కొత్త జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి | The new district named papanna | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాకు పాపన్న పేరు పెట్టాలి

Aug 13 2016 12:18 AM | Updated on Sep 4 2017 9:00 AM

చత్రపతి శివాజీ సమకాలికుడు,బహుజన రాజ్య స్థాపనకు పోరాడిన సర్దార్‌ సర్వాయి పాపన్న పేరు కొత్తగా ఏర్పడే ఒక జిల్లాకు పెట్టాలని గౌడ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ అయిలి వెంకన్నగౌడ్‌ ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. పాపన్న జ యంతిని ప్రభుత్వం అధికారి కంగా నిర్వహించాలనే డిమాం డ్‌తో గౌడ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోట నుంచి మండలంలోని ఖిలాషాపూర్‌ పాపన్న కోట వరకు బైకు ర్యాలీ నిర్వహించారు.

రఘునాథపల్లి : చత్రపతి శివాజీ సమకాలికుడు,బహుజన రాజ్య స్థాపనకు పోరాడిన సర్దార్‌ సర్వాయి పాపన్న పేరు కొత్తగా ఏర్పడే ఒక జిల్లాకు పెట్టాలని గౌడ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ అయిలి వెంకన్నగౌడ్‌ ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు.  పాపన్న జ యంతిని ప్రభుత్వం అధికారి కంగా నిర్వహించాలనే డిమాం డ్‌తో గౌడ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోట నుంచి మండలంలోని ఖిలాషాపూర్‌ పాపన్న కోట వరకు బైకు ర్యాలీ నిర్వహించారు.
 
ఈ సందర్బంగా ఖిలాషాపూర్‌ బస్టాండ్‌ వద్ద పాపన్న విగ్రహానికి వెంకన్నగౌడ్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడు తూ.. బలహీనవర్గాల పక్షానపోరాడిన వీరుడు పాపన్న చరిత్రను బావి తరాలకు అందించాలన్నారు. కర్ణాటకలోని బసవేశ్వరుడికి రూ. 40 లక్షలు ఇచ్చిన రాష్ట్ర సర్కార్‌ ఇక్కడి పాపన్నను మరువడం విస్మయం కలిగిస్తోందన్నారు.
 
హైదరాబాద్‌లో ఐదెకరాల విస్తీర్ణంలో పాప న్న భవన నిర్మాణం, ట్యాంక్‌ బండ్‌పై పాపన్న విగ్రహం, గీత కార్పొరేషన్‌కు 1000 కోట్లు కెటాయించడంతో పాటు నూతన కల్లు గీత సమగ్ర చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 18న పాపన్న జయంతిని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని  పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర గౌడ జేఏసీ కన్వీనర్‌ అంబాల నారాయణగౌడ్, దుర్గయ్యగౌడ్, మాజీ ఎంపీపీ కుమార్‌గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు బొనగాని యాదగిరిగౌడ్, వైస్‌ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్యగౌడ్, నామాల బుచ్చయ్య, వంగ శ్రీను, దుబ్బాన నాగేష్,  మనోహర్‌గౌడ్, సురేష్‌గౌడ్, బాలకృష్ణగౌడ్, ముకేష్‌గౌడ్, రంజిత్‌గౌడ్, బత్తుల లత పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement