యువకుడు అనుమానాస్పద మృతి | The mysterious death of a young man | Sakshi
Sakshi News home page

యువకుడు అనుమానాస్పద మృతి

Nov 25 2016 10:52 PM | Updated on Sep 4 2017 9:06 PM

యువకుడు అనుమానాస్పద మృతి

యువకుడు అనుమానాస్పద మృతి

పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ముళ్ల పొదల్లో చిన్నవడుగూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

పెద్దవడుగూరు(తాడిపత్రి): పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ముళ్ల పొదల్లో చిన్నవడుగూరు గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ (24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఎస్‌ఐ రమణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు శ్రీకాంత్‌ గుత్తిలో మందుల దుకాణంలో పనిచేసేవాడని తెలిపారు. మృతదేహంపై చిన్నపాటి గాయాలు, సమీపంలోనే ద్విచక్రవాహనం పడి ఉండటాన్ని గుర్తించారు. ఎవరైనా చంపి పడేశారా.. అనారోగ్య కారణాలతో మృతి చెందాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మృతుడికి భార్య శ్రీలత, 9 నెలల కుమార్తె ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement