ప్రజామోదం మేరకు ప్రాజెక్టులు నిర్మించాలి : జూలకంటి | The extent of public support to build projects | Sakshi
Sakshi News home page

ప్రజామోదం మేరకు ప్రాజెక్టులు నిర్మించాలి : జూలకంటి

Jul 17 2016 7:56 PM | Updated on Sep 4 2017 5:07 AM

ప్రజామోదం మేరకు ప్రాజెక్టులు నిర్మించాలి : జూలకంటి

ప్రజామోదం మేరకు ప్రాజెక్టులు నిర్మించాలి : జూలకంటి

చిట్యాల : ప్రజామోదం మేరకు ప్రాజెక్టులను, పరిశ్రమలను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు.

చిట్యాల : ప్రజామోదం మేరకు ప్రాజెక్టులను, పరిశ్రమలను ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి అన్నారు. చిట్యాలలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణాలు ఆస్తులను కోల్పోతున్న రైతులకు మార్కెట్‌ రేట్‌ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. హైవే వెంట హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల్లో ఎన్ని నాటుకున్నాయో సీఎం సమీక్ష ద్వారా నిర్థారణ చేసుకోవాలన్నారు. సమావేశంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మామిడి సర్వయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముల్కపల్లి రాములు, మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, నారబోయిన శ్రీనివాస్, శీలా రాజయ్య పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement