డబ్బు కోసం అన్న కూతురి కిడ్నాప్‌ | The daughter was kidnapped for money | Sakshi
Sakshi News home page

డబ్బు కోసం అన్న కూతురి కిడ్నాప్‌

Aug 18 2016 10:56 PM | Updated on Sep 4 2017 9:50 AM

అన్న కూతురిని కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేశాడో ప్రబుద్ధుడు.

గోల్కొండ: అన్న కూతురిని కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్‌ చేశాడో ప్రబుద్ధుడు. నిందితుడిని గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై సుందరయ్య  కథనం ప్రకారం... గోల్కొండ రిసాలాబజార్‌కు చెందిన ఖలీల్, జాకీర్‌ అన్నదమ్ములు. ఖలీల్‌కు హజేరాబేగం అనే మూడేళ్ల కూతురు ఉంది. పెయింటర్‌గా పనిచేసే జాకీర్‌ తన అన్న ఖలీల్‌ వద్ద బాగా డబ్బు ఉందని, ఎలాగైన అన్న వద్ద నుంచి డబ్బు కొట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందు కోసం అన్న కూతురు హజేరాబేగంను కిడ్నాప్‌ చేయాలని పథకం వేశాడు.

బుధవారం ఇంటి ముందు ఆడుకుంటున్న హజేరాబేగంను షాప్‌కెళ్లి చాక్లెట్‌ తెచ్చుకుందామని బైక్‌పై ఎక్కించుకొని ఉడాయించాడు. ఆ తర్వాత అన్నకు ఫోన్‌ చేసి గొంతు మార్చి మాట్లాడాడు. రూ.5 లక్షలు ఇవ్వకపోతే నీ కూతుర్ని చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని బుధవారం రాత్రి ఖలీల్‌ గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్‌ నెంబర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం రాత్రి లంగర్‌హౌస్‌లో జాకీర్‌ను అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న చిన్నారిని రక్షించారు. నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement