కేసీఆర్‌ అన్న కుమార్తె ఆందోళన | The concern is the daughter of KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ అన్న కుమార్తె ఆందోళన

Aug 30 2016 10:46 PM | Updated on Aug 20 2018 4:27 PM

ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె చొప్పదండి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బొడిగ శోభను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

నాంపల్లి: ఒకవైపు అసెంబ్లీ లోపల జీఎస్‌టీ బిల్లుపై చర్చ... మరొక వైపు అసెంబ్లీ బయట గన్‌పార్కు ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమార్తె రమ్య ఆందోళన... మంగళవారం మధ్యాహ్నం నాంపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు.... వెరసి గన్‌పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె చొప్పదండి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బొడిగ శోభను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

అమరవీరుల స్థూపం వద్దకు రమ్య చేరుకుందనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు మరింత భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే బొడిగ శోభను అరెస్టు చేసే వరకు అక్కడిlనుంచి కదిలే ప్రసక్తే లేదని ఆమె భీష్మించుకు కూర్చున్నారు. మహిళా పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో ఎట్టకేలకు  పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement