ఉత్తమ ప్రదర్శనగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’

ఉత్తమ ప్రదర్శనగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’

వీరవాసరం: వీరవాసరం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో చిలకమర్తి కళాప్రాంగణంలో గుండా లక్ష్మీరత్నావతి కళావేదికపై నిర్వహిస్తున్న అఖిల భారత స్థాయి నాటిక పోటీల్లో ‘ఎవరిని ఎవరు క్షమించాలి’  నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచిందని నిర్వాహకులు గుండా రామకృష్ణ మంగళవారం తెలిపారు. కేబీఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ సికింద్రాబాద్‌ ప్రదర్శించిన ఈ నాటిక మానవతా విలువలు, బంధాలు, అనుబంధాలను వ్యక్తీకరించిందన్నారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా జనచైతన్య ఒంగోలు ప్రదర్శించిన ‘చేతిరాత’, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా కృష్ణా కల్చరల్‌ ఆర్ట్స్‌ గుడివాడ వారి ‘పితృదేవోభవ’ నాటికలు ఎంపికైనట్టు వెల్లడించారు. ఉత్తమ రచయితగా దిష్టిబొమ్మలు రచయిత ఎస్‌.వేంకటేశ్వరరావు, ఉత్తమ దర్శకుడిగా ఉదయ్‌భాగవతుల (ఎవరిని ఎవరు క్షమించాలి), ఉత్తమ నటుడిగా ఎల్‌.శంకర్‌ (చేతిరాత), ఉత్తమ నటిగా ఎల్‌.పద్మావతి (చేతిరాత), ఉత్తమ ప్రతినాయకుడిగా పి.నాగేశ్వరరావు (మధుర స్వప్నం), ఉత్తమ హాస్యనటుడిగా ఎన్‌ఎస్‌ఆర్‌వీ ప్రసాద్‌ (దిష్టిబొమ్మలు) నిలిచారు. న్యాయ నిర్ణేతలుగా తిరుమల కామేశ్వరరావు, విన్నకోట వేంకటేశ్వరరావులు వ్యవహరించారు.

 

 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top