బాలిక వివాహాన్ని ఆపిన అధికారులు | The authorities refused to child marriage | Sakshi
Sakshi News home page

బాలిక వివాహాన్ని ఆపిన అధికారులు

Apr 21 2016 10:10 AM | Updated on Sep 3 2017 10:26 PM

కొద్దిసేపట్లో జరగబోయే బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు.

కొద్దిసేపట్లో జరగబోయే బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం అంబ్లాపూర్ గ్రామానికి చెందిన గోస్కుల కొమురయ్య, రమ దంపతుల కుమార్తె(15) ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. ఆమెకు తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కోట కుమార్ అనే యువకునితో పెళ్లి నిశ్చయమైంది.

 

గురువారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం వరుని కుటుంబం, బంధువులు అంబ్లాపూర్‌కు తరలివచ్చారు. అయితే, బాలికకు వివాహం జరగనుందనే సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు గ్రామానికి చేరుకున్నారు. రెండు కుటుంబాల వారిని గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు పిలిపించారు. బాలికకు మైనారిటీ తీరిన తర్వాత అంటే మరో మూడేళ్ల తర్వాత మాత్రమే ఆమెను పెళ్లి చేసుకుంటాననే హామీ పత్రాన్ని వరునితో రాయించి, వారిని వెనక్కి పంపేశారు.

Advertisement
 
Advertisement
Advertisement