‘డిసెంబరుకు అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేయండి’ | The AP assembly construction shall complete December | Sakshi
Sakshi News home page

‘డిసెంబరుకు అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేయండి’

Sep 15 2016 3:54 PM | Updated on Aug 27 2018 8:46 PM

డిసెంబర్ కల్లా అసెంబ్లీ భవన నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి యనమల ఆదేశించారు.

ఈ ఏడాది డిసెంబర్ చివరి కల్లా అసెంబ్లీ, శాసనమండలి భవన నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. గురువారం ఆయన సీఆర్డీఏ కమిషనర్, అడిషనల్ కమిషనర్, అసెంబ్లీ, శాసనమండలి భవనాల ప్లానింగ్ అధికారులతో వెలగపూడిలోని సచివాలయంలోని తన చాంబర్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, స్పీకర్,మంత్రులు, అధికారుల చాంబర్లలలో సౌకర్యాలు, భద్రతపై చర్చించారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో డిసెంబరు ఆఖరుకు భవనాల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. ఈనెల 19వ తేదీన మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణతో కలసి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement