అగళిలో 11.7 డిగ్రీలు కనిష్టం | temperature details | Sakshi
Sakshi News home page

అగళిలో 11.7 డిగ్రీలు కనిష్టం

Feb 3 2017 11:40 PM | Updated on Mar 28 2019 6:27 PM

కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలతో చలివాతావరణం కొనసాగుతుండగా మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : కొన్ని మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలతో చలివాతావరణం కొనసాగుతుండగా మరికొన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం అగళిలో 11.7 డిగ్రీలు కనిష్టం నమోదు కాగా... మడకశిర 12.4 డిగ్రీలు, తనకల్లు 12.7 డిగ్రీలు, రొద్దం 13.4 డిగ్రీలు, అమడగూరు 13.8 డిగ్రీలు, ఎన్‌పీ కుంట, గాండ్లపెంట, సోమందేపల్లి 13.9 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 14 నుంచి 19 డిగ్రీల వరు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీలు నమోదయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement