అగళిలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత | temperature details | Sakshi
Sakshi News home page

అగళిలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత

Jan 10 2017 10:56 PM | Updated on Mar 28 2019 6:27 PM

అగళిలో మంగళవారం 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

అనంతపురం అగ్రికల్చర్‌ : అగళిలో మంగళవారం 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లు 13.8 డిగ్రీలు, రొద్దం 13.9 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 14 నుంచి 18 డిగ్రీల వరకు కొనసాగాయి. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 33 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా జిల్లా అంతటా చలితీవ్రత కొనసాగుతోంది. రాగల నాలుగు రోజులు కూడా వాతావరణ పరిస్థితిలో మార్పు ఉండదని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్‌ అధికారి డాక్టర్‌ బి.సహదేవరెడ్డి తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement