హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు.
నల్లగొండ: హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీ హామీని విస్మరించారని కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.