ప్రేమ పెళ్లి.. ఆత్మహత్య | tejashwani suicide at punganuru | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి.. ఆత్మహత్య

Apr 9 2017 9:50 AM | Updated on Nov 6 2018 7:53 PM

ప్రేమ పెళ్లి.. ఆత్మహత్య - Sakshi

ప్రేమ పెళ్లి.. ఆత్మహత్య

పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లె రోడ్డులో నివాసముంటున్న యువతి ఆత్మహత్య కు పాల్పడింది

పుంగనూరు : పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లె రోడ్డులో నివాసముంటున్న యువతి ఆత్మహత్య కు పాల్పడింది. ఎస్‌ఐ హరిప్రసాద్‌ కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన నగేష్‌ కుమారై తేజశ్వని (20 ) తిరుపతిలో ఉన్న బంధువుల ఇంటికి తరచూ వెళ్లేది. ఈ క్రమంలో పుంగనూరుకు చెందిన ఆర్థర్‌పాల్‌ కుమారుడు ప్రశాంత్‌పాల్‌తో పరిచయమైంది.

ఇద్దరూ 2016లో పెళ్లి చేసుకొని పుంగనూరులో కాపురం పెట్టారు. వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో ఆమె శుక్రవారం రాత్రి ప్రశాంత్‌పాల్‌కు ఫోన్‌ చేసి తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పింది. వెంటనే ప్రశాంతపాల్‌ అక్కడికి చేరుకుని స్థానికులతో కలిసి ఆమెను పుంగనూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement