ఉపాధ్యాయుల ‘అప్‌గ్రేడ్‌’ ధర్నా | Teachers 'upgraded' protest | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల ‘అప్‌గ్రేడ్‌’ ధర్నా

Jul 28 2016 10:59 PM | Updated on Sep 4 2017 6:46 AM

ధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయులు

ధర్నాలో పాల్గొన్న ఉపాధ్యాయులు

రాష్ట్రంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని తెలుగు, హిందీ భాషా పండిట్, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని 11 సంఘాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.


ఖమ్మం : రాష్ట్రంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని తెలుగు, హిందీ భాషా పండిట్, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రంలోని 11 సంఘాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మనోహర్‌రాజు, ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ సైదులు, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బండి నర్సింహారావు, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు సీహెచ్‌.దుర్గాభవాని మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఒక్క ఉపాధ్యాయుడి సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకుండా పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలు పెట్టండి.. టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయండి అని చెబుతూ ప్రభుత్వం విద్యారంగం నుంచి తప్పుకోవాలని చూస్తోందన్నారు. చర్చల సందర్భంగా సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ధర్నా శిబిరానికి టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, ఎస్‌టీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జీవీ నాగమల్లేశ్వరరావు, రామాచారి, ఎస్‌కె.మహబూబ్‌ అధ్యక్షత వహించగా.. సీఐటీయూ జిల్లా నాయకులు లింగయ్య, కార్మిక సంఘం ఐఎఫ్‌టీయూ నాయకులు అశోక్, ఐఎన్‌టీయూసీ జిల్లా నాయకులు జలీల్‌ ధర్నా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.పూర్ణచందర్‌రావు, టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నెల్లూరి వీరబాబు, టీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.విజయ్, ఎస్‌టీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.కోటారెడ్డి, వివిధ సంఘాల జిల్లా నాయకులు ఆర్‌.రవికుమార్, రమాదేవి, బి.రాందాస్, మహబూబ్‌అలీ, నాగిరెడ్డి, బి.కృష్ణారావు, జె.రాంబాబు, బి.హనుమంతు, టి.ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, ఎం.మురళీమోహన్, పీవీఆర్‌కే ప్రసాద్, ఎం.ఆంథోని, ఉమాదేవి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement