పోలేరమ్మ దీవెన ఎవరికో? | tdp leader's waiting for polaramma blessings | Sakshi
Sakshi News home page

పోలేరమ్మ దీవెన ఎవరికో?

Aug 23 2016 12:30 AM | Updated on Sep 4 2017 10:24 AM

పోలేరమ్మ దీవెన ఎవరికో?

పోలేరమ్మ దీవెన ఎవరికో?

వెంకటగిరి: రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా జరగనున్న వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర ఉత్సవ కమిటీ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కమిటీ చైర్మన్‌గిరిని దక్కించుకునేందుకు పలువురు టీడీపీ నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోటీ వాతావరణంలో చైర్మన్‌గిరీ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ టీడీపీ వర్గాల్లో కొనసాగుతోంది.

  • చైర్మన్‌ గిరికి పోటీ
  • జాతర ఏర్పాట్లు ప్రారంభం
  • ఊసేలేని శాశ్వత కమిటీ 
  • ఉత్సవ కమిటీతోనే మమ
  • వెంకటగిరి: రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా జరగనున్న వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర ఉత్సవ కమిటీ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కమిటీ చైర్మన్‌గిరిని దక్కించుకునేందుకు పలువురు టీడీపీ నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోటీ వాతావరణంలో చైర్మన్‌గిరీ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ టీడీపీ వర్గాల్లో కొనసాగుతోంది.  
    ప్రయత్నాలు ముమ్మరం
    పోటీలో మరికొంత మంది పట్టణానికి చెందిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెల రోజుల కిందటే కమిటీ తుది రూపాన్ని సిద్ధం చేసి దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉత్సవ కమిటీ చైర్మన్, సభ్యుల నియామకం వారం పది రోజుల్లోగా ఆదేశాలు రానున్నట్లు దేవాదాయ అధికారులు తెలియజేస్తున్నారు. 
    సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో జాతర 
    జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వెంకటగిరి పోలేరమ్మ జాతర ఈ ఏడాది సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. వినాయక చవితి తరువాత వచ్చే బుధవారం తొలిచాటు వేయడం ఆనవాయితీ. ఈ మేరకు సెప్టెంబర్‌ 7వ తేదీన తొలిచాటు మలి బుధవారం అయిన 14న రెండో చాటు మూడో బుధవారం అయిన 21వ తేదీన అమ్మవారి నిలుపు, 22వ తేదిన నిమజ్జన మహోత్సవాలు జరగనున్నాయి. 

Advertisement

పోల్

Advertisement