రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కొత్తపేట వచ్చిన ఆమె స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి పార్టీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. మహిళా అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, విద్యార్థులను వేధించడం, పేద
-
జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన
కొత్తపేట :
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కొత్తపేట వచ్చిన ఆమె స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డితో కలిసి పార్టీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు స్వగృహంలో విలేకర్లతో మాట్లాడారు. మహిళా అధికారులపై దాడులు, దౌర్జన్యాలు, విద్యార్థులను వేధించడం, పేదల పింఛన్లు, రేష¯ŒS రద్దు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ధనాన్ని తన అనుయాయులకు, పార్టీ పెద్దలకు ఎలా మళ్లించాలన్న ధ్యాసే తప్ప రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. రెండున్న సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది జగ¯ŒSమోహనరెడ్డి ఒక్కరేనన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారన్నారు.
కాపు కార్పొరేష¯ŒSతో చేతులు దులపుకున్నారు
కాపులను బీసీలలో చేరుస్తామని హామీ ఇచ్చిన పాలకులు నిధులు లేని కార్పొరేష¯ŒS ఏర్పాటు చేసి చేతులు దులపుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని శాంతియుతంగా పోరాడుతుంటే సెక్ష¯ŒS 30,144 అమలు, గృహ నిర్బంధం చేస్తున్నారని అన్నారు. వారు మాత్రం జనచైతన్య యాత్రలు పేరుతో ప్రజల సమస్యలు పరిష్కరించకుండా విహార యాత్ర లు చేస్తున్నారని దుయ్యపట్టారు. రాష్ట్ర వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శి కర్?ర నాగిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, రావులపాలెం ఎంపీపీ కోట చెల్లయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సేవాదళ్ కార్యవర్గ సభ్యుడు చల్లా ప్రభాకరరావు, జిల్లా పార్టీ కార్యదర్శి రెడ్డి చంటి, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రదాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.