మాతాశిశు మరణాలను తగ్గించమే లక్ష్యం
మాతా శిశు మరణాలను తగ్గించటమే ఐసీడీఎస్ లక్ష్యమని వరల్డ్ బ్యాంక్ స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ పేర్కొన్నారు.
ఎమ్మిగనూరురూరల్: మాతా శిశు మరణాలను తగ్గించటమే ఐసీడీఎస్ లక్ష్యమని వరల్డ్ బ్యాంక్ స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలో ఎస్సీకాలనీలో 44 వ అంగ్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రా పనితీరును తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇస్నిప్ సంస్థ అంగన్‌వాడీ కేంద్రాల్లో సామాజిక వేడుకలను ఏవిధంగా నిర్వహించాలి, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే అంశాలపై అంగన్‌వాడీ వర్కర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తుందని తెలిపారు. ప్రతి నెలా గర్భిణులు ఆరోగ్య పరిక్షలు చేయించుకుంటున్నారా? లేదా, వారు తీసుకొవాల్సిన పోషక విలువలు, బిడ్డకు తల్లిపాల ఆవశ్యకతపై సెక్టారు సమావేశాల్లో సూపర్‌వైజర్లు వర్కర్లకు వివరించాలని సూచించారు. సమావేశంలో సీడీపీఓ నాగమణి పాల్గొన్నారు.