శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించండి
శ్రీశైల మహాక్షేత్రంలో కష్ణా పుష్కరాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ రవికష్ణ సూచించారు.
– పోలీస్ ఆంక్షలను పాటించండి
– అపరిచితులకు గదులు కేటాయించవద్దు
– డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి
– జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ
శ్రీశైలం- శ్రీశైల మహాక్షేత్రంలో కష్ణా పుష్కరాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ రవికష్ణ సూచించారు. శనివారం ఆయన క్షేత్ర పురవీధుల్లో సైకిల్ తిరుగుతూ పరిశీలించారు. కష్ణా పుష్కరాల బందోబస్తుకు వచ్చే పోలీసులకు వసతి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన బ్యారక్స్, కళాశాల, పాఠశాల వసతి గహాలను పరిశీలించారు. సత్రాలు, లాడ్జీల నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రెడ్ల సత్రంలో సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. సత్రాల గదుల కేటాయింపులో పూర్తి సమాచారంతో పాటు గుర్తింపు కార్డులను సేకరించాల్సిందిగా ఆదేశించారు. అలాగే ఎక్కువ మొత్తం చెల్లించడానికి ఇష్టపడిన అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితులలో గదులను ఇవ్వవద్దని కోరారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా పోలీసు నిఘాతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే భద్రతా చర్యల్లో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డును పరిశీలించారు. ఆయన వెంట ఓఎస్‌డీలు రవిప్రకాష్, సత్య ఏసుబాబు, డీఎస్పీలు సుప్రజ, రమేష్‌బాబు, ఈశ్వర్‌రెడ్డి, బాబా ఫకద్ధిన్, సీఐలు చక్రవర్తి, గంటా సుబ్బారావు తదితరులు ఉన్నారు.
డయల్ 100 పుస్తకం ఆవిష్కరణ
శ్రీశైలంలోని మేకల బండ ప్రాథమిక పాఠశాలలో జిల్లా ఎస్పీ ఆకే రవికష్ణ డయల్ 100 పుస్తకాలను ఆవిష్కరించారు. దీనికి ముందుగా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఇంటి సమీపంలోనూ, మీకు తెలిసిన ప్రాంతాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు, లేదా బ్యాగులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ఓ వైపు పుష్కరభద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ మరో వైపు శ్రీశైలం పీఎస్ నుంచే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ కేంద్రాలకు సెట్ ద్వారా మానిటరింగ్ చేస్తూ వివరాలను సేకరించారు. పుష్కర వి«ధుల్లో పాల్గొనడానికి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు.